రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 13వ విడత డబ్బులను నేడు విడుదల చేయనుంది. నేడు కర్ణాటకలోని బెళగావిలో పర్యటించనున్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.16,800 కోట్లు జమ చేయనున్నారు. కాగా, ఈ-కేవైసీ పూర్తిచేయని రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కావు.