నేడు ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ, నాగాలాండ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల్లో చెరో 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మేఘాలయాలో 21.6 లక్షల మంది ఓటర్లు ఉండగా, నాగాలాండ్ లో ఓటర్ల సంఖ్య 13 లక్షలుగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.