వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో ఆదివారం పేకాటస్థావరంపై వట్టిచెరుకూరు పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్దనున్న 2030 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో పేకాట స్థావరాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కలగయ్య హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa