టీడీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆయన నేతృత్వంలో మేడికొండూరు మండల ఎస్సీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ..... వైసీపీ పాలనలో రాజ్యాంగ ధిక్కరణ, చట్టాల ఉల్లంఘన అడుగడుగునా జరుగుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం దళితులకు రక్షణగా ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. వైసీపీ పాలనలో దళితులపై వందలాది దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, హత్యలు, ఉద్యోగాలు కోల్పోవడం, భూముల కబ్జా చేయడం వంటి ఘటనలు పరంపరగా జరుగుతున్నాయన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారిని వంచిస్తున్న జగనరెడ్డికి దళితులు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.