పల్నాడులో ఓ టీడీపీ నేత హత్యకు కుట్ర జరుగుతోందంటూ మాచర్ల టీడీపీ ఇన్చార్జ్ జూలకంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... త్వరగా లో ఓ పెద్ద నేతను హతమార్చాలని వైసీపీ పధకం పన్నిందని ఆరోపించారు. పల్నాడులో పోలీసుశాఖ వైసీపీలో చేరిందన్నారు. పోలీసు స్టేషన్లలోనే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కారంపూడి పోలీసు స్టేషన్ తమ అడ్డా అంటూ టీడీపీ బిసీ నేత నాగేశ్వరరావు పై దాడి చేశారన్నారు. మాచర్ల ఎమ్మెల్యే సీటులో ఓ శునకాన్ని కూర్చొబెట్టారని వ్యాఖ్యలు చేశారు. రోజుకోక గ్రామంలో అల్లర్లు సృష్టించే పనిలో ఉన్నారన్నారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సహనం కోల్పోయే వరకు వెళ్లవద్దని హెచ్చరించారు. భవిష్యత్ పరిణామాలకు పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ నేత జూలకంటి పేర్కొన్నారు.