ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్థవీడు మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన 40 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రమణరెడ్డి, నారాయణ, రంగారెడ్డి, పిచ్చిరెడ్డి, పాల్గొన్నారు.