వైసీపీ ప్రభుత్వానికి గడ్డుకాలం దగ్గరపడిందని మార్కా పురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ అరాచకాలను వివరించారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ.., వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్ ప్రజలపై వివిధ రకాల పన్నుల భారం మోపి నడ్డి విరిచారన్నారు. పెట్రోల్, డీజిల్, ఇసుక, సిమెంట్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజలపై మరింత భారం మోపారన్నారు. ప్రభుత్వంపై ప్రజలందరూ విసుగెత్తారన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న కంచర్ల శ్రీకాంత్‌ను గెలిపించాలని పట్టభద్రులను కోరారు.