నాగవంశీయులను బీసీ డీ నుంచి ఏ గ్రూపులోకి మార్చాలని టీడీపీ నాగవంశం సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ఎరుబోతు రమణారావు డిమాండ్ చేశారు. నాగవంశ రాష్ట్ర కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటుకు ఆదివారం ఆయన సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నాగవంశీయులకు కుల సంఘం భవన నిర్మాణం చేసి ఆర్థికంగా వెనుకబడిన వారికి సబ్సి డీ రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నాగవంశీ యులలో అత్యధికులు పేదలే ఉన్నారని, వారిని విద్యతోపాటు ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేసి, ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.