కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో వెలసిన శ్రీ గుహ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పాల్గున మాసం సోమవారం సందర్భంగా స్వామి వారికి ఉదయం నుంచి విశేషంగా అభిషేకము పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పట్టణవాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. స్వామికి మొక్కుబడి ఉన్న భక్తులు వారి మొక్కలు తీర్చుకున్నారు.