సీఎం జగన్ పై నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తున్న రాక్షసుడు జగన్రెడ్డి అని ద్వజమెత్తారు. పవిత్రమైన వృత్తిలో ఉన్న గురువులతో మద్యం షాపుల వద్ద కాపలా పెట్టించిన నీచుడు ఈ ముఖ్యమంత్రని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీసీ జనగణన కోసం ఢిల్లీలో పోరాడుతున్నది ఒక టీడీపీనే అని లోకేశ్ గుర్తుచేశారు.