ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా ఇంటర్ పరీక్షలు రాశారు. లా చదవాలనే ఆసక్తితో ఈ పరీక్షలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేశ్ బీజేపీ తరఫున బరేలీలోని బిత్రి చైన్ పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa