మెడికో విద్యార్థుల ఆత్మహత్యలపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోని 512 మెడికల్ కాలేజీలు ఇచ్చిన సమాచారం ప్రకారం గత ఐదేళ్లలో 119 మంది మెడికల్ స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది. వీరిలో 64 మంది MBBS, 55 మంది పీజీ విద్యార్థులు ఉన్నారని తెలిపింది. అలాగే ఐదేళ్లలో MBBSలో 160 మంది, పీజీలో 1,006 మంది డ్రాప్ అవుట్స్ అయ్యారని పేర్కొంది.