సమాజంలో కొందరు మానవత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఏపీలోని గుంటూరు కొత్తపేట పరిధిలో ఆదివారం జరిగింది. అప్పుడే పుట్టిన మగశిశువును ఓ తల్లి వదిలేసింది. కవర్లలో చుట్టి, డ్రైనేజీ పక్కన పెట్టేసి వెళ్లిపోయింది. స్థానికులు ఆ బిడ్డను రక్షించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కసాయిగా మారిన కన్నతల్లిని నెటిజన్లు విమర్శిస్తున్నారు.