ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సీబీఐ అరెస్ట్ చేసిందని విమర్శించారు. సిసోడియా అరెస్ట్ సీబీఐ అధికారులకే నచ్చలేదని, చాలా మంది అధికారులు మనీశ్ అరెస్టుపై వ్యతిరేక భావనతో ఉన్నారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.