తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట వరి. అయితే ఈ పంటను ఆశించే పురుగులు ఎక్కువగానే ఉంటాయి. వాటిల్లో నల్ల కంకి ఒకటి. ఇవి సూక్ష్మ సాలిడు వర్గానికి చె౦దిన పురుగులు. ఇవి ఆశి౦చిన ఆకులపై పసుపు వర్ణపు చారలు, గింజలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే ప్రోఫెనొఫాస్ 2 మి.లీ లేదా డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేస్తే సరిపోతుంది.