మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. తండ్రి అన్న గౌరవంలేకుండా యువత ప్రవర్తిస్తోంది. చిత్తూరులో ఇలాంటి దారుణమే చోటు చేసుకొంది. ఓ తండ్రి పట్ల కుమారుడు అమానుషంగా ప్రవర్తించాడు. దారుణంగా కొడుతూ ప్రియురాలికి వీడియో కాల్లో చూపించాడు. నగరానికి చెందిన ఢిల్లీబాబు హోంగార్డుగా పనిచేస్తున్నారు.. అతడి కుమారుడు భరత్ మూటలు మోసే కూలీగా జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం నగరంలోని ఓ కాలనీకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో ఢిల్లీబాబు కుమారుడ్ని మందలించాడు. అక్కడితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చిత్తూరు టూ టౌన్ పోలీసులు భరత్‌ను స్టేషన్‌కు పిలిపించి మందలించారు.
తండ్రిపై కక్ష పెంచుకున్న భరత్.. తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. తన వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన తన తండ్రిపై దాడి చేస్తానని ఆమెతో చెప్పాడు. తండ్రి కొడుతూ టార్చర్ చేశాడు.. ఇదంతా వీడియో కాల్లో ప్రియురాలికి చూపించాడు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో ఢిల్లీబాబుకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స చేశారు. బాధితుడి ఫిర్యాదుతో చిత్తూరు టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.