ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు కుంకుమ ప్రసాదంగా ఇవ్వాలని కొత్త పాలకమండలి నిర్ణయించింది. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కర్నాటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు భక్తుల సౌకర్యార్థం దుర్గాఘాట్ నుంచి కొండపైకి రెండు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 18 ఎజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు.