వైఎస్సార్ రైతుభరోసా మూడో విడత పంపిణీకి ఏపీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. నేడు 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో మెుత్తం రూ.1,090 కోట్ల నిధులను జమ చేయనుంది. తెనాలిలో జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి పెట్టుబడి సాయాన్ని రైతులకి పంపిణీ చేయనున్నారు. దీంతోపాటు 2022 డిసెంబర్లో మాండోస్ తుపాన్ వల్ల నష్టపోయిన 91,237 మంది రైతుల ఖాతాల్లో రూ.76.99 కోట్లను జమ చేస్తారు.