విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ మల్కాపురం సీమీపంలోని హెచ్పీసీఎల్ సోమవారం ఆర్ధరాత్రి క్రూడ్ ఆయిల్ లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడేం జరుగుతుందో తెలియక సిబ్బంది ఆందోళన చెందారు. అంతలోనే తేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు అదుపుచేశారు. అయితే అప్పటికే ఇద్దరు కార్మికులు జి. రమణ, చంద్రబాబు అనే కార్మికులు గాయపడ్డారు.
వీరిలో రమణ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ఇద్దరు కార్మికులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హెచ్పీసీఎల్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. మంటలు పూర్తిగా ఆర్పివేశారు. ఎటువంటి ప్రమాదం లేదని హెచ్పీసీఎల్ యాజమాన్యం తెలిపింది. ఇదిలావుండగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని యాజమాన్యం ప్రకటించింది.