కంది, మినప, పెసర పప్పు, బఠాణీల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. వీటి వల్ల గుండెకు హాని జరగదు. వీటిలోని పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పప్పుల ద్వారా సోడియం శరీరానికి తక్కువగా అందుతుంది. దీని వల్ల రక్తపోటు ప్రమాదాన్ని నివారించొచ్చు. పప్పులు తింటే శరీరానికి ఐరన్ బాగా అందుతుంది. దీని వల్ల రక్తలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. పప్పుల్లోని పీచు పదార్థాల వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది.