ఎస్ రాయవరం మండలం వమ్మవరం సమీపాన ఉన్న వరహానదిలో పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు మంగళవారం ఉదయం ఎస్ రాయవరం ఎస్సై ప్రసాదరావు స్థానిక విలేకరులకు తెలిపారు. రాంబిల్లి మండలం హరిపురం పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన సర్వసుద్ధి రమణ (52) కొన్ని రోజులుగాఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో ఉన్న తన తల్లి వద్ద ఉంటున్నాడని ఎస్ఐ చెప్పారు. సోమవారం సాయంత్రం వరహా నదిలో ప్రమాదవ శాత్తూ మరణించినట్లు చెప్పారు. గత కొంతకాలంగా రమణ మద్యానికి బానిసై వుంటున్నాడని, మద్యం మత్తులో సోమవారం సాయంత్రం వరహానదిలో పడి మృతి చెందివుంటాడని ఎస్ఐ చెప్పారు.