మాకవరపాలెం మండలం వజ్రగడలో జగనన్న భూ రక్షణ సమగ్ర డ్రోన్ రీ సర్వే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ వెంకట గౌరీ లక్ష్మీ మాట్లాడుతూ జగనన్న భూ పథకం కింద చేస్తున్న రీ సర్వేలో ప్రతి ఒక్కరి భూములు వివరాలు కచ్చితంగా నమోదు జరిగి అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సర్వే పూర్తయిన తర్వాత ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.