గుంటూరు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి సూచించారు. కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ లో తృతీయ బహుమతి పొందిన హర్షవర్ధన్ రాజును సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులంతా ఆటలు ఆడటం ద్వారా సంపూర్ణ మానసిక, శారీరక దృఢత్వం పొందుతారని తెలిపారు. హర్షవర్ధన్ రాజుకు శిక్షణ ఇచ్చిన ఖాజా మొహిద్దిన్ ను అభినందించారు.