గుంటూరు: వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద నేడు 51. 12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2వేల చొప్పున రూ. 1, 090 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. అలాగే 2022 డిసెంబర్లో మాండోస్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన 91, 237 మంది రైతుల ఖాతాల్లో రూ. 76. 99 కోట్లను 3 జమచేస్తారు. కాగా, రైతు భరోసాలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు విడతల్లో రూ. 11, 500లను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.