గుంటూరు: మార్చి 7న పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అరుణాచలంలోని గిరి ప్రదక్షణకు గుంటూరు-2 డిపో నుంచి రెండు స్పెషల్ హైటెక్ బస్సుల్ని ఏర్పాటు చేసినట్లు మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సులు మార్చి 5న రాత్రి 9: 30 గంటలకు గుంటూరులో బయలుదేరి కాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శించి, మార్చి 6న సాయంత్రం అరుణాచలం చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు. అరుణాచలేశ్వరుని దర్శించుకొని మార్చి 7న సాయంత్రం బయలుదేరి 8న ఉదయం 6: 30 గంటలకు తిరిగి గుంటూరు చేరుతాయని వివరించారు. ఒక్కో టికెట్టు ధర రూ. 2400 ఉంటుందని తెలిపారు. సమాచారం కోసం 9959225421 నెంబర్ ను సంపాదించాలని సూచించారు.