కొన్ని కరివేపాకుల్ని నీళ్లలో వేసి మరిగించి వడకట్టాలి. ఆ నీటిలో బెల్లం వేసుకుని తాగాలి. కరివేపాకు టీ తాగితే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. కరివేపాకులో ఉండే ఫినోలిక్స్ అనే యాంటీ ఆసిడ్ చర్మ వ్యాధులను పోగొడుతుంది. కరివేపాకులోని విటమిన్లు, ఖనిజాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. జుట్టు, చర్మాన్ని మెరిపిస్తాయి. ఈ టీ తాగితే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.