నెల్లూరు జిల్లా, పొదలకూరు, తోడేరు చిన్నచెరువులో మృతి చెందిన ఆరుగురు మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు. సోమవారం స్థానిక బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండలంలో జరిగిన టీడీపీ సమావేశంలో ఆయన మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం తోడేరు చిన్న చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మృతి చెందిన యువకులకు ఎంతో భవిష్యత్తు ఉందని, ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. వారి ప్రాణాలను తిరిగి తీసుకోరాలేమని, ఆ యువకుల మీద ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.