రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడును గెలిపించాలని కందుకూరు మాజీ ఎమ్మెల్యే, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు దివి శివరాం కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం యూనిట్, క్లస్టర్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు, నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టభద్రులందరూ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గుమ్మడి రాజాయాదవ్, రావూరి రాధాకృష్ణమనాయుడు, నాగార్జున్‌రెడ్డి, రమేష్‌నాయుడు, ధనుంజయనాయుడు, సతీష్ నాయుడు, ఖయ్యుమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.