శ్రీకాకుళం నగరంలో మురుగు కాలువలో పడి ఓ యాచకుడు మృతి చెందాడు. ఒకటో పట్టణ ఎస్ఐ గణేష్ వివరాల ప్రకారం.. నగరంలో బిచ్చమెత్తుకునే ఓ వృద్ధుడు నగరపాలక సంస్థ పరిధిలోని కాలువలో పడిపోయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెళ్లి అతన్ని బయటకు తీసి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. మూడురోజుల పాటు మృతదేహాన్ని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉంచు తున్నామని, ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.