రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ వ్యాజ్యాలపై మార్చి 28న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘అమరావతే రాష్ట్ర రాజధాని’ అని హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వంతోపాటు.. రైతులు, అమరావతి పరిరక్షణ సమితి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వాస్తవానికి ఈ కేసులను ఈ నెల 23న విచారించాల్సి ఉంది. ఒకసారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమని ఈ నెల 14న సుప్రీం కోర్టు సర్క్యులర్ జారీ చేసింది. కానీ, గత 23న కేసుల విచారణ జరగలేదు. తాజాగా.. సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీం కోర్టు సర్క్యులర్ కారణంగా కేసులు విచారణకు రాలేదని, కోర్టుకు హోలీ సెలవుల అనంతరం వెంటనే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేఎం జోసె్‌ఫలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జోక్యం చేసుకుని.. వాదనలకు ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించింది. ఒక రోజు సమయం పడుతుందని నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. మార్చి 28న విచారిస్తామని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa