ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స నిమిత్తం అడ్మిట్ అయినట్లు తెలిసింది. కాగా, నరేంద్ర మోదీ తమ్ముడైన ప్రహ్లాద్ మోదీ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈక్రమంలో అనారోగ్యానికి గురికావటంతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.