స్థానిక అనకాపల్లి గవరపాలెం శంకర్ కాలనీ లోని డా. హిమశేఖర్ స్కూల్ నందు సైన్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఫెయిర్ లో ప్రతీ విద్యార్థి వారు చేసిన ప్రాజెక్ట్స్ ప్రదర్శించడం జరిగింది. సైన్స్ మీద క్విజ్ మరియు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. సైన్స్ ప్రోగ్రాం లో భాగంగా విద్యార్థులు ధరించిన సైంటిస్ట్ వేశధారణలు అలరించాలి. పీరియడక్ టేబుల్, సేవ్ ఎన్విరాన్మెంట్, మొబైల్ ఎడిక్షన్ కీ సంబందించిపిల్లలు వేసిన నాటకాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా స్కూల్ కరస్పాండెంట్ జనార్ధన్ మాట్లాడుతూ విద్యార్థులకు నిత్యజీవితం లో సైన్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు. భవిష్యత్తు లో సైన్స్ మాత్రమే ప్రపంచాన్ని ఏకైక మార్గం గా నిలుస్తుంది అని చెప్పారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న సైన్స్ రిటైర్డ్ ప్రొఫసర్ కె. రాంమోహన్ రావు గారు శాస్త్రవేత్తల సామర్ధ్యం మరియు సైన్స్ గొప్ప తనాన్ని పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పోటీలలో గెలుపొందిన విద్యార్థుల కి ప్రిన్సిపాల్ పి. సురేష్ చౌదరి బహుమతులు అందించారు. ఇంకా ఈ కార్యక్రమం లో ఇంచార్జి గోపి కృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ, సైన్స్ అధ్యాపకులు పుష్ప, హరిప్రసాద్, సూర్య, యమున, నాగ లక్ష్మి, జగన్, పూర్ణ, గిరీష్, శివ, తేజస్విని అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.