ఫోన్ పేలి ఓ 60 ఏళ్ల వృద్ధుడు మరణించిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో సోమవారం జరిగింది. దయారామ్ బరోద్ అనే వృద్ధుడు ఫోన్ ఛార్జ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. దీంతో తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు ఫోన్ చేయగా కలవకపోవడంతో అనుమానం వచ్చి చూడగా విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.