2024 ఎన్నికల బరిలో మరోసారి నిలిచేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన భార్య జిల్ బైడెన్ వెల్లడించారు. తాను కూడా అందుకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. వయోభారం కారణాలతో 2024 ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలగుతారనే ప్రచారాన్ని జిల్ కొట్టి పారేశారు. బైడెన్ త్వరలోనే తన ప్రచార కార్యక్రమాల వివరాలు వెల్లడిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా బైడెన్ కూడా ఈ విషయాన్ని గతంలో చెప్పారు.