తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నమక్కల్ జిల్లాలో మంగళవారం కారు, కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళలు మరణించారు. ప్రయాణికులతో వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. నుజ్జునుజ్జయిన వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు కట్టర్ ద్వారా వాహనాన్ని కట్ చేయాల్సి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa