బ్యాంకు నుండి నగదు డ్రా చేసుకొని వెళుతున్న వ్యక్తి దృష్టిని ఓ ఆగంతకుడు మళ్లించి రెండు లక్షలు రూపాయల అపహరించుకు పోయిన ఘటన చీరాలలో చోటు చేసుకుంది.ఈ మేరకు మంగళవారం రాత్రి ఫిర్యాదు అందగా వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ మల్లిఖార్జునరావు కథనం ప్రకారం కొత్తపేటకు చెందిన బూదాటి వెంకటేశ్వర్లు సోమవారం మధ్యాహ్నం పేరాల యూనియన్ బ్యాంకు నుండి రెండు లక్షల రూపాయలు డ్రా చేసుకొని స్కూటీ డిక్కీలో పెట్టుకొని వెళుతూ మార్గమధ్యంలో వైన్ షాప్ వద్ద ఆగి మద్యం కొనుక్కున్నాడు. ఆ మద్యం సీసాను కూడా స్కూటీ డిక్కీలో పెడుతుండగా ఓ ఆగంతకుడు అక్కడికి వచ్చి కింద పడిన డబ్బు మీదేనా అనడంతో వెంకటేశ్వర్లు అటు చూస్తుండగా డిక్కీలోని నగదును తీసుకొని అతను పరారయ్యాడు.ఈ మేరకు వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని సిఐ మల్లిఖార్జునరావు తెలిపారు.