విశాఖపట్నం లో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎయిర్ పోర్టు నుంచి ఎన్ ఏడీ ఫ్లై వోవర్ వైపు వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. కాకాని నగర్ సిగ్నల్ జంక్షన్ వద్ద బుల్లెట్‌పై ఇద్దరు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొంది. దీంతో విష్ణువర్ధన్ తీవ్రంగా గాయపడగా. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వీరిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో విష్ణువర్ధన్ మృతి చెందాడు. విష్ణువర్ధన్(28) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వర్క్ ఫ్రం హోం ఉప్పాడు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎస్. ఐ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.