పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని గొరపల్లి గ్రామానికి చెందిన పూసర్ల వెంకటేశ్ (32) అనే వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై మృతుడి భార్య అనూష మంగళవారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటేశ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ పోషణకు ఆదాయం చాలకపోవడంతో స్థానికంగా తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు. అయితే చేసిన అప్పులు తీర్చలేక, వారికి ముఖం చూపించలేక మనస్తాపంతో ఫిబ్రవరి 22న ఇంట్లో పురుగుల తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులు ఆయనను గమనించి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్ మంగళవారం మృతి చెందాడు.