ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్మాది సైఫ్ దురాగతాలకు బలైన డాక్టర్ ధారావతు ప్రీతి నాయక్ మృతికి కారణమైన వ్యక్తులను తక్షణమే ప్రభుత్వం శిక్షించాలని మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఆలయం నుండి స్థానిక గడియారం స్తంభం సెంటర్ వరకు ప్రభుత్వ సంతాప ర్యాలీ నిర్వహించారు.