గోపవరం మండల పరిధిలోని రాచాయపేట , టి. సండ్రపల్లి సచివాలయం నందు వాలంటీర్లు మరియు వ్యవసాయ, సచివాలయ సిబ్బందితో మండల వ్యవసాయ అధికారి బి. అరవింద నాయక్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రబి సీజన్లో గోపవరం మండలంలో సాగు చేసిన 682 ఎకరాల పంటలకు ఈ క్రాప్ చేశారని తెలియచేశారు. ఈ క్రాప్ చేసిన రైతులు జాబితా ఆధారంగానే రాబోయే రోజుల్లో పథకాలకు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ , గ్రామ రైతులు, జడ్పీఎన్ఎఫ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.