దేశ రాజధాని ఢిల్లీలో మయన్మార్ కు చెందిన ఓ రిజిస్టర్డ్ శరణార్థి మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఫిబ్రవరి 22న ఓ ఆటో డ్రైవర్ కాళింది కుంజి మెట్రో స్టేషన్ నుండి ఆమెను, రెండున్నరేళ్ల ఆమె కూతురుని అపహరించి తన గదికి తీసుకెళ్లాడు. అనంతరం మరో ముగ్గురితో కలిసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఓ మారుమూల ప్రాంతంలో వదిలేశారు. బాధితురాలు భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa