శ్రీకాకుళం జిల్లాలో గుజరాతి పేట తోట వీధి పరిధిలో ఉన్న రోడ్డు అధ్వానంగా తయారయింది. గత రెండేళ్ల నుంచి రోడ్డుకి ఇంతవరకు మరమ్మత్తులు చేయలేదు. వర్షాకాలం సమయంలో నీరు రోడ్డు గుంతల్లో చేరి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఈ మేరకు రోడ్డు మొత్తం రాళ్లతో మరియు గుంతలతో ఇబ్బందిగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. ఈ రోడ్డుపై ప్రతిరోజూ విద్యార్థులు సైకిల్ పై పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని విద్యార్థులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై కూడా వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందంటున్నారు. కావున అధికారులు రోడ్డు బాగుచేసే చర్యలు తీసుకోవాలని కోరారు.