సంతబొమ్మాలి మండలం, బోరుభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా మంగళవారం సర్ సి. వి. రామన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి. వి. రమణ మూర్తి మాట్లాడుతూ భారత దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన విజ్ఞాన శాస్త్ర శిఖరం సర్ సి. వి రామన్ అని అన్నారు. ఆ మహనీయుని జయంతిని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు టి. లోకేశ్వర రావు, డి. ఉమాశంకర్, ఏ. వెంకట రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థులు ప్రదర్శించిన రోడ్డు ప్రమాదాలను సులభంగా గుర్తించడం, కిడ్నీ పని చేసే విధానం, గాలి మర, బిందు సేద్యం, అగ్ని ప్రమాదాల నివారణ వంటి అనేక ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. తిరుపతిరావు, టి. లోకేశ్వరరావు, డి. ఉమాశంకర్, బి. తాతారావు, ఏ. వెంకట రెడ్డి, బి. లక్ష్మణ రావు, సి. హెచ్. కృష్ణారావు, ఎర్రయ్య, కె. త్రినాధ రావు, బాడాన రాజు, డి. ఉమాదేవి, కె. రమణమ్మ, టి. విజయలక్ష్మి, బి. నాగమణి, కె. తవిటిరెడ్డి, ఏ. శంకర రావు, గోపాల రెడ్డి పాల్గొన్నారు.