తమ పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు మరో మూడు రోజులు పొడిగించినట్లు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ ప్రకటించారు. పార్టీ మూడో విడత సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బంది పెట్టాయని, గడువు మరికొంత పెంచాలని జన సైనికుల నుంచి అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా మహాక్రతువులో పాలు పంచుకుంటున్న వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళలను ప్రశంసించారు.