పానీపూరీని ఇష్టపడని వారుండరు. అయితే, అతిగా పానీపూరీ తింటే అనారోగ్య సమస్యలేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పానీపూరీ వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. పిల్లలు వీటిని ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుందట. అలాగే విరేచనాలు, వాంతులు, కామెర్లు, అలర్స్, జీర్ణక్రియ మందగించడం, ప్రేగుల్లో మంట వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.