రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ కి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా, ధర్మవరం, పట్టణంలోని కేశవ నగర్లో ఇదేంఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్నినిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి, వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధిపై వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులు వంటి అరాచకాలతో పాటు ధరలు అదుపులోకి రావాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వడ్డెర సాధికారసమితి జిల్లా అధ్యక్షుడు పల్లపురవీంద్ర, 7వ వార్డు టీడీపీ ఇనచార్జ్ పల్లపు శివశంకర్; నాయకులు గరుగు వెంగప్ప, కరెంటు ఆది తదితరులు పాల్గొన్నారు.