అనంతపురం జిల్లా, చిలమత్తూరు, మండలంలోని కోడూరు తోపులో 44వ జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున తృటిలో పె ద్ద ప్రమాదం తప్పింది. పెనుకొండ వైపు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ ప్రమాదాని కి గురైంది. వేగంగా వస్తూ కోడూరు తోపు వద్ద కూడలి లో ఏర్పాటుచేసిన వేగ నియంత్రకాలను గుర్తించడంలో వాహన డ్రైవర్ విఫలమయ్యాడు. దాంతో వేగంగా వచ్చిన ట్యాంకర్‌ని అదుపుచేయడం కష్టమవడంతో డివైండర్‌ని ఢీకొట్టుకుంటూ కుషావతి నదిలోకి దూసుకుపోయింది. ఘటనలో రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్ పాక్షికంగా ధ్వంసమైంది. అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్లో ఉన్న వారికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని నిర్మాణాలు చేసుకోవడం వల్ల రోడ్డుపై అనుకోకుండా జరిగే ఇటువంటి ప్రమాదాలతో ఎప్పుడు ఏప్రమాదం పొంచివుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.