మద్యానికి బానిసై ఒంటరితనం భరించలేక పురుగుమందు తాగిన ఉయ్యాల వెంకటేశ్వరరావు (23) విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈదర గ్రామానికి చెందిన ఇతని తల్లి చిన్నతనంలోనే చనిపోగా, తండ్రి నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళిపోవడంతో మేనమామ వద్ద పెరిగాడు. ఇతను శోభనాపురం గ్రామానికి చెందిన నల్లూరి నాగమల్లేశ్వరరావు మామిడితోటలో పనిచేస్తున్నాడు. ఈ నెల 17న తోటలో కాపలాకు వెళ్లి కలుపు మందు తాగడంతో మేనమామ చిట్టిపోతుల కోటయ్య, సోదరుడు తిరుపతయ్య కలసి 108లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడు తిరుపతిరావు ఫిర్యాదు మేరకు ఆగిరిపల్లి ఎస్సై ఎన్.చంటిబాబు మృతదేహానికి పోస్టుమార్టం జరిపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.