ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. జగన్ ప్రభుత్వం పదేపదే ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే యత్నాలను కొనసాగిస్తూనే ఉందని సీపీఎం శ్రీనివాసరావు తెలిపారు. తాజాగా మార్చి 1 నుంచి 3 వరకు పింఛన్ల పంపిణీ పేరిట ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేసిందని, దీన్ని నిలుపుదల చేయాలని కోరుతూ మంగళవారం చీఫ్ ఎలకో్ట్రరల్ ఆఫీసర్ ముఖే్షకుమార్ మీనాకు లేఖ రాశారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు పెచ్చుమీరి పోతున్నాయంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఈవోకు లేఖ రాశారు.