‘రాష్ట్రంలోని 175 సీట్లలో పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు, పవన్‌కల్యాణ్‌కు ఉందా? అని సీఎం జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదం. పాలనాధికారం ఇచ్చిన ప్రజలను మోసం చేసిన వ్యక్తివి నువ్వు’ అని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 175 సీట్లలో ఒక్క దాంట్లో అయినా మీతో కలిసొచ్చే పార్టీ ఈ రాష్ట్రంలో ఒక్కటైనా ఉందా? ఆర్థిక నేరస్థుడు, అరాచక వాది, నియంత అయిన నీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? అని సోమిరెడ్డి నిలదీశారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకోవటాన్ని హేళనగా మాట్లాడటం మీ నియంతృత్వ పోకడలకు నిదర్శనం అని మండిపడ్డారు. సీఎం జగన్‌రెడ్డికి ప్రచార పిచ్చి పీక్‌కి చేరిపోయిందని, ప్రచార యావతో తప్పుడు లెక్కలేసుకుంటూ రూ.కోట్లు ఖర్చు పెట్టి, ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో రైతుల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.35 వేల కోట్లేనని చెప్పారు. రైతుకు చేస్తున్న సాయం గోరంత అయితే ప్రచారం కొండంత అని మండిపడ్డారు.